PPM: గుమ్మలక్ష్మీపురం మండలం లోవముఠా కానసింగి అటవీ ప్రాంతంలో అరుదైన కందగడ్డ పుష్పం వికసించింది. ఊదా- గోధుమ రంగులో కనిపించే ఈ పుష్పం చిత్తడి నేలల్లో మాత్రమే పెరుగుతుందని స్థానికులు తెలిపారు. వారం రోజుల వరకు తాజాగా ఉండే ఈ దుంప జాతిని తినడానికి పనికిరాదు. ఔషధ వినియోగాల్లో ఉపయోగిస్తారని చెబుతున్నారు.