W.G: సంప్రదాయేతర ఇంధన వనరులలో సోలార్ ఎనర్జీ ఉత్పాదన మరింతగా పెరగాల్సి ఉందని పలువురు నిపుణులు పేర్కొన్నారు. భీమవరంలోని ఓ కళాశాల ఆధ్వర్యంలో సోలార్ పీవీ డ్రైవింగ్ ఇన్నోవేషన్ జాతీయస్థాయి వర్క్ షాప్ నిర్వహించారు. ఐఐటీ చెన్నై డా శ్రీరామ్ మాట్లాడుతూ.. రెన్యుబుల్ ఎనర్జీని అభివృద్ధి చేయడంతోపాటు స్టోర్ చేయటం తిరిగి వినియోగించటంపై పూర్తి అధ్యయనం అవసరమన్నారు.