BPT: బాపట్ల పురపాలక సంఘ కార్యాలయంలో గురువారం సంక్రాంతి పండుగను ముందస్తుగా ఘనంగా నిర్వహించారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలు సంప్రదాయ సంస్కృతి ఉత్సవంగా మారాయి. కార్యాలయ ప్రాంగణం మొత్తం రంగురంగుల ముగ్గులు, సంప్రదాయ అలంకరణలు, పండుగ కళతో సందడిగా వెలిగిపోయింది.