SKLM: రణస్థలం సత్యసాయి భజన మండలి ఆధ్వర్యంలో శ్రీ భగవాన్ సత్యసాయి బాబా 100వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ మేరకు మండలి సభ్యులు బుధవారం ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావును తన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తదనంతరం బాబా జయంతి వేడుకలకు ఎమ్మెల్యేను ఆహ్వానించారు. సత్యసాయి బాబా బోధనలు సమాజానికి మార్గదర్శకమని కొనియాడారు.