KDP: ప్రొద్దుటూరు ఎగ్జిబిషన్ GSTకి సంబంధించిన భారీ నగదు లెక్కల్లో కనిపించడం లేదు. ఈ విషయాన్ని జీఎస్టీ అధికారులు గురువారం గుర్తించారు. 2021లో ఎగ్జిబిషన్‌కు సంబంధించి జీఎస్టీ రూ.15.25 లక్షలుగా నిర్ధారించారు. ఈ సొమ్మును చెల్లించామని మున్సిపల్ అధికారులు చెప్పగా ఆ డబ్బులు తమకు జమ కాలేదని GST అధికారులు అంటున్నారు. వెంటనే జీఎస్టీ అధికారులు ఆడిట్‌కు సిద్ధమయ్యారు.