సత్యసాయి: తాడిమర్రి మండలం మరువపల్లి గ్రామస్థులు హిందూపురం ఎంపీ పార్థసారథిని ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మరువపల్లి గ్రామంలో అయ్యప్ప స్వామి భజన మందిరానికి నిదులు కేటాయించాలని ఎంపీని కోరారు. ఎంపీ స్పందించి తప్పకుండా నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మరువపల్లి గ్రామస్థులు పాల్గొన్నారు.