W.G: తాడేపల్లిగూడెం జాతీయ రహదారి నెం. 216ను అనుకుని ఆటోనగర్‌కు సమీపంలో నిర్మించిన కల్వరి టెంపులు ఈ నెల 13వ తేదీన సాయంత్రం 6 గంటలకు ప్రారంభించనున్నట్లు పీఆర్వో అనిల్ మంగళవారం తెలిపారు. కల్వరి టెంపుల్ వ్యవస్థాపకులు డాక్టర్ పీ.సతీష్ కుమార్ ప్రారంభిస్తారన్నారు. ఈ సందర్భంగా ఆయన దైవ సందేశాన్ని విశ్వాసులకు ఉపదేశిస్తారన్నారు.