ప్రకాశం: జిల్లాలో ఇంట్లో గృహోపకరణాలపై అడిషనల్ లోడ్ చెల్లింపులో 50% రాయితీ ఇస్తున్నట్లు ఎస్ఈ కట్టా వెంకటేశ్వర్లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 1 కిలో వాటు రూ. 2,250 అవుతుందని రాయితీ వల్ల రూ. 1,250 చెల్లించవచ్చని అన్నారు. ఈ అవకాశం ఈనెల 31 వరకు మాత్రమేనని పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.