WG: పెనుమంట్ర పోలీసులు మార్టేరు ప్రధాన కూడలిలో ఆదివారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వాహనదారులను నిలిపి వేసి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఎస్సై కే.స్వామి మాట్లాడుతూ.. యువత నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడుపుతూ ప్రమాదాల బారిన పడటంపై ఆవేదన వ్యక్తం చేశారు. హెల్మెట్ ప్రాధాన్యతను వివరిస్తూ.. వేగం కంటే ప్రాణం ముఖ్యమని సూచించారు.