కోనసీమ: రానున్న ఐదు రోజులు జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 19 మండలాల పరిధిలో సుమారుగా 41 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 54 వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యేందుకు అవకాశం ఉందని రియల్ టైం గవర్నెన్స్ ద్వారా వాతావరణ కేంద్రం తెలిపిందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.