మంత్రి నారా లోకేష్‌ను అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్షుడు పూల నాగరాజు, ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి గురువారం రాత్రి కలిశారు. ఉండవల్లిలో జరిగిన జోనల్ కమిటీ సమావేశంలో పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికలపై లోకేష్ దిశానిర్దేశం చేశారు. తమకు కీలక బాధ్యతలు అప్పగించినందుకు నేతలు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.