VZM : బొండపల్లి మండలంలోని బోడ సింగపేట ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ గజపతినగరం నియోజకవర్గ ఇంఛార్జ్ డాక్టర్ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో మోతిలాల్ నెహ్రూ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నెహ్రూ గొప్పతనం గురించి పిల్లలకు డాక్టర్ దుర్గాప్రసాద్ వివరించారు. అనంతరం పిల్లలకు చాక్లెట్స్ బిస్కెట్స్ పెన్నులు పంపిణీ చేశారు.