PLD: వెల్దుర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజల నుంచి వివిధ సమస్యలపై అర్జీలను స్వీకరించారు. సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు సంబంధిత శాఖల అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.