ATP: బార్ల లైసెన్స్ కోసం దరఖాస్తు గడువును ఈనెల 17 వరకు పొడిగించినట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ రామ్మోహన్రెడ్డి సోమవారం పేర్కొన్నారు. 2025-28 నూతన బార్ పాలసీలో భాగంగా గతనెల 30న లాటరీ నిర్వహించగా మిగిలిన 9 బార్లకు ప్రభుత్వం ఈనెల 12న రీ నోటిఫికేషన్ విడుదల చేసిందన్నారు. 17న ఆఖరి తేదీ అన్నారు. ఆసక్తిగలవారు దరఖాస్తు చేసుకోవాలన్నారు.