ATP: జిల్లాలో నేర నియంత్రణే లక్ష్యంగా SP జగదీష్ ఆదేశాల మేరకు పోలీసులు రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐలు, ఎస్సైలు హెచ్చరించారు. గంజాయి, మత్తు పదార్థాల రవాణాపై ప్రత్యేక నిఘా ఉంటుందని స్పష్టం చేశారు. పాత నేరస్తులు సత్ప్రవర్తనతో మెలగాలని, చట్ట వ్యతిరేక పనులకు దూరంగా ఉండాలని సూచించారు.