మచిలీపట్నం మార్కెట్ యార్డ్ ఛైర్మన్ కుంచే దుర్గాప్రసాద్ (నాని) గురువారం ఉదయం స్థానిక రైతు బజార్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పలు నిత్యావసర వస్తువుల దుకాణాలను పరిశీలించి, ధరల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వినియోగదారులతో మాట్లాడి, వారి సమస్యలు విన్నారు. అధిక ధరలకు విక్రయాలు జరిపే వారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు.