KDP: ఖాజీపేట మండలంలోని ఒక గ్రామానికి చెందిన బాలిక(16) అదృశ్యమైంది. ఒంటిమిట్ట మండలంలో ఓ గ్రామంలో ఉంటున్న మేనత్త ఇంటికి నెల కిందట ఆమె వచ్చింది. ఈ క్రమంలో గత నెల 29న తెల్లవారుజామున ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆమె తండ్రి గాలించిన ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఇవాళ పోలీసులను ఆశ్రయించడంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.