KKD: గొల్లప్రోలు వద్ద రైలు ఢీకొని 30కిపైగా గొర్రెలు మృతి చెందగా, మరో 12 గొర్రెలకు తీవ్రగాయాలయ్యాయి. సుద్దగడ్డ, ఏలేరు వరద నీరు ప్రవహిస్తుండడంతో బ్రిడ్జి కింద నుంచి వెళ్ల లేక గొల్లప్రోలుకు చెందిన గొర్రెల వెంకటరమణ తన గొర్రెలను రైల్వేట్రాక్ మీదుగా పొలంలో మేపేందుకు తీసుకెళ్తున్నాడు. అదే సమయంలో 2 ట్రాక్‌లపై ఒకే సమయంలో రైళ్లు రావడంతో గొర్రెలను ఢీకొన్నాయి.