విశాఖ జగదాంబకు చెందన పదిమంది స్నేహితులు జీవనధారం నిమిత్తం విదేశాలకు వెళ్ళటానికి ప్లాన్ చేసుకున్నారు. తమను బయట దేశాలకు పంపేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామని ఓ సంస్థ లక్షల్లో డబ్బులు వసూళ్లు చేసి ఇప్పుడు చేతులెత్తేసిందని బాధితులు తెలిపారు. తమ నుంచి డబ్బులు తీసుకోవడమే కాకుండా తిరిగి తమపైనే కేసులు పెట్టారని వాపోయారు.