VSP: ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో సీఐఐ సదస్సుకు సంబంధించిన ఏర్పట్లు దాదాపు పూర్తయ్యాయి. 14, 15 తేదీలలో జరిగే ఈ కార్యక్రమానికి విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ ఇంజినీరింగ్ మైదానంలో ప్రధాన వేదిక ఏర్పటు చేశారు. దీంతో పాటు నగరమంతా ఎంతో సుందరంగా తయారు చేశారు. ఇక విశాఖ విదేశీ ప్రతినిధులు, సీఎం, కేంద్ర మంత్రులు, పెట్టుబడి దారుల కోసం ఎదురుచూడటమే మిగిలిందంటూ విశాఖ వాసులు అంటున్నారు.