ప్రకాశం జిల్లాలో రైతులకు సేవ చేయడంలో ఎరువుల డీలర్లు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని వ్యవసాయ అధికారి ప్రసాద్ రావు అన్నారు. గురువారం తాళ్లూరు వ్యవసాయ కార్యాలయంలో ఎరువుల డీలర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్నదాతలకు సహకరించకుండా అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా ప్రతి డీలర్ పనిచేయాలని తెలిపారు.