ప్రకాశం: కనిగిరిలోని ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో నూతనంగా నిర్మిస్తున్న డయాలసిస్ కేంద్రం నిర్మాణ పనులను ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి మంగళవారం పరిశీలించారు. పనులను నాణ్యతగా చేపట్టాలని సంబంధిత కాంట్రాక్టర్ను ఎమ్మెల్యే ఆదేశించారు. డయాలసిస్ కేంద్రంలో కిడ్నీ రోగులకు అన్ని వసతులను కల్పిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.