ATP: జిల్లాలో నేడు 9,954 ఇళ్లకు గృహ ప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. రాష్ట్రస్థాయిలో 3 లక్షల ఇళ్ల గృహ ప్రవేశాల సందర్భంగా రాయచోటిలో జరిగే కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరవుతారని చెప్పారు. జిల్లా స్థాయి కార్యక్రమం గుత్తిలో జరుగుతుందని అన్నారు. ఆయా నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యే ప్రారంభిస్తారని చెప్పారు.