KRNL: మంత్రాలయ శ్రీ రాఘవేంద్ర స్వామి మఠానికి తమిళనాడుకు చెందిన దాత రూ.1,00,000 విరాళం అందజేసినట్లు మఠం మేనేజర్ శ్రీనివాస్ తెలిపారు. తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూర్లోని మట్టుపాలెంకు చెందిన ఆరుముగం కుటుంబ సమేతంగా మంత్రాలయాన్ని సందర్శించారు. గ్రామదేవత మంచాలమ్మను, రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని దర్శించుకొన్నారు. అనంతరం అన్నదాన సేవకు విరాళాన్ని అందజేశారు.