KRNL: ఎమ్మిగనూరు పట్టణంలోని వీవర్స్ కాలనీ మైదానంలో విశ్వశాంతి యాగం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం నిర్వహించిన మహా పూర్ణాహుతి హోమంలో MLA బీవీ జయనాగేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ బీటీ నాయుడు పాల్గొన్నారు. కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామి ఆధ్వర్యంలో మహా పూర్ణాహుతి హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నట్లు అర్చకులు పేర్కొన్నారు.