SKLM: ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తామంటుందని వైసీపీ ఆరోపిస్తూ… రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వైసీపీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ అధ్యక్షతన నరసన్నపేటలో బుధవారం భారీ నిరసన ర్యాలీని చేపట్టారు. పైడితల్లి అమ్మవారి ఆలయం వద్ద నుంచి ర్యాలీగా వచ్చి నరసన్నపేట తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.