W.G: రైతుల గురించి మాట్లాడే అర్హత మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరావుకి లేదని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. మంగళవారం తణుకు కూటమి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రైతులను దుర్భాషలాడిన మాజీ మంత్రి ఏనాడూ వారిని పట్టించుకోలేదని విమర్శించారు. తుఫాను సమయంలో రైతులకు అండగా నిలబడి పంట నష్టాన్ని అంచనా వేస్తామన్నారు.