NDL: పార్టీని నమ్ముకున్న ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని మాజీ మంత్రి బుగ్గన భరోసా ఇచ్చారు. బేతంచెర్ల పట్టణ వైసీపీ కార్యాలయంలో బీఎల్ఏలు, నాయకులు, కౌన్సిలర్లు, పార్టీ శ్రేణులతో శనివారం ఆయన సమావేశమై దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చని, వాటిని ధీటుగా ఎదుర్కొనేందుకు ప్రతి కార్యకర్త ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు.