PLD: నరసరావుపేట శిశుమందిరం రోడ్డులోని మంచి నీళ్ల ప్లాంట్ వెనుక భాగంలో మీరాబీ అనే మహిళపై వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేసి కరిచాయి. స్థానికులు వెంటనే స్పందించి ఆమెను రక్షించారు. ఈ ప్రాంతంలో ఓ వ్యక్తి కుక్కలకు బిస్కెట్లు వేస్తూ పెంచుతున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి వీధి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.