ప్రకాశం: ఒంగోలులో అమర జవాన్ స్తూపం ఏర్పాటు చేసేందుకు త్వరలోనే అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. పట్టణంలోని అంబేద్కర్ భవన్లో జరిగిన ‘నేవీ డే’ ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సౌత్ బైపాస్‌లో స్థూపం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.