NLR: మంత్రి నారాయణను చూస్తే ఆశ్చర్యం వేస్తుందని.. ఎంతో కష్ట పడుతున్నారని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. రాజధాని అమరావతి కోసం నారాయణ ఎంతో కష్టపడుతున్నారని తెలిపారు. రాజధానిలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని, వర్షాలు వల్ల కొంత జాప్యం జరుగుతున్నా.. పూర్తి స్థాయిలో అమరావతి అభివృద్ధి జరిగితే ఎంతో అద్భుతంగా ఉంటుందన్నారు.