కాకినాడ వ్యాప్తంగా తీవ్రమైన ఎండలు మండిపోతున్నాయి. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకే పలుచోట్ల 44 డిగ్రీల రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీనితో రోడ్లన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి. తీవ్రమైన ఎండవేడికి కాకినాడ నగరం కళ తప్పింది. సాయంత్రం 5 గంటల వరకు ప్రజలు ఎవరూ బయటకు రావద్దని అధికారులు హెచ్చరించడంతో, ప్రధాన రహదారులన్నీ వాహనాలు లేక వెలవెలబోయాయి.