ELR: సుమారు రూ. 4 కోట్ల 50 లక్షల వ్యయంతో బుట్టాయిగూడెం నుంచి జంగారెడ్డిగూడెం వరకు నూతనంగా నిర్మించిన రోడ్డును పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు గురువారం ప్రారంభించారు. ప్రజల సౌకర్యం కోసమే ప్రభుత్వం అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. రహదారి నిర్మాణంతో ప్రజల ప్రయాణ సౌలభ్యం మరింత మెరుగుపడుతుందని, వ్యాపార ,వ్యవసాయ రవాణాకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.