సత్యసాయి: కనగానపల్లి మండలానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు ఆవుల ముత్యాలప్ప ఇవాళ మృతి చెందారు. ఈ సందర్భంగా స్థానిక మండల, గ్రామ నాయకులతో కలిసి పరిటాల శ్రీరామ్ భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలలతో నివాళులర్పించారు. ముత్యాలప్ప మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ, ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.