కృష్ణా: కేంద్ర పథకమైన జన శిక్షణ సంస్థాన్ (JSS) కింద ఎన్టీఆర్ జిల్లాలోని 4,600 మంది మహిళలకు ఉపాధి కల్పించామని ఏపీ BJP తమ అధికారిక X ఖాతాలో శుక్రవారం పోస్ట్ చేసింది. ఈ పథకం కింద జిల్లాలోని మహిళలకు ఆర్థిక సాధికారత కల్పించామని తెలిపింది. హ్యాండ్ ఎంబ్రాయిడరీ, దుస్తుల కుట్టుపని తదితర కార్యకలాపాలలో మహిళలకు ఉపాధి కల్పించాలని BJP తమ అధికారిక ఖాతాలో వెల్లడించింది.