ATP: గుమ్మగట్ట మండలంలోని భైరవాణి తిప్ప గ్రామంలో ఉన్న ఇన్స్పెక్షన్ బంగ్లా ఆవరణలో బీటీపీ ఆయకట్టు రైతులతో ఇవాళ సమావేశం నిర్వహించనున్నట్లు జల వనరుల శాఖ డీఈ గీతాలక్ష్మి తెలిపారు. బీటీ ప్రాజెక్టు పరిధిలోని కుడి, ఎడమ కాలువ కింద ఆయకట్టుకు రొటేషన్ పద్ధతిలో సాగునీటి విడుదల తేదీలను నిర్ణయిస్తామన్నారు. సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొనాలని సూచించారు.