సత్యసాయి: ధర్మవరం మండలం సీతారాంపల్లి గ్రామంలో ముస్లిం సోదరులు నిర్వహించిన ఉరుసు మహోత్సవంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం భక్తులు, గ్రామస్తులతో మాట్లాడి సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం, అభివృద్ధికి అందరం కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.