అన్నమయ్య: చిట్వేల్ మండల పరిధిలోని కే కందులవారిపల్లి గ్రామంలో పొంగళ్ల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముందుగా సల్ల కార్యక్రమం నిర్వహించి వచ్చిన భక్తుల అందరికీ సల్ల పోశారు. అనంతరం పొంగల్ వండి అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. మంచి వర్షాలు కురిసి రైతులకు పంటలు బాగా పండాలని గ్రామ పెద్దలు ఆకాంక్షించారు.