VZM: జేసీ సేతుమాధవన్ శనివారం రామభద్రపురంలోని రేణు గ్యాస్ ఏజెన్సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టాక్ రిజిస్టర్లు, వినియోగదారుల రికార్డులను పరిశీలించారు. గ్యాస్ పంపిణీలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా పారదర్శకంగా వ్యవహరించాలని ఏజెన్సీ నిర్వాహకులను ఆదేశించారు. వినియోగదారుల నుంచి ఫిర్యాదులు అందితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.