ASR: సర్వేపల్లి రాధా కృష్ణ విద్యా కిట్స్ అందజేసేందుకు విద్యార్థుల వివరాలు అందజేయాలని ఏజెన్సీ DEO మల్లేశ్వరావు గురువారం తెలిపారు. పోలవరం జిల్లాలో 898 పాఠశాలల్లో 52,399 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఆయా పాఠశాలల HMలు ఆన్లైన్లో వివరాలు నమోదు చేయాలన్నారు. ప్రతీ విద్యార్థికి సరిపడే బూట్లు ఇచ్చేందుకు పాదం కొలతలు నమోదు చేయాలన్నారు.