ASR: తమిళనాడులో జరిగే గిరిజన యువ సమ్మేళనానికి అరకు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్ధిని కే.నాగశ్రీ ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ చలపతిరావు తెలిపారు. ఈ సమ్మేళనం మై భారత్ ఆధ్వర్యంలో ఈనెల 27 నుంచి 31 వరకు జరుగుతుందన్నారు. ఇటువంటి సమ్మేళనాలతో వివిధ గిరిజన సంస్కృతి, సంప్రదాయాలపై విద్యార్ధులకు అవగాహన కలుగుతుందన్నారు.