ATP: టెట్ పరీక్షలు రేపటి నుంచి 21 వరకు జిల్లాలోని 7 కేంద్రాలలో జరగనున్నాయి. ఈ సందర్భంగా పరీక్షలకు ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. ఆయన మాట్లాడుతూ.. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు, పోలీసు బందోబస్తు నిర్వహించాలని సూచించారు. రెండు సెషన్లలో ఈ పరీక్ష జరుగుతుందని తెలిపారు.