WG: నరసాపురం టౌన్ రుస్తుంబాదకు ఆదివారం కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ రానున్నారు. శెట్టిబలిజ సంఘ వ్యవస్థాపకుడు దొమ్మేటి వెంకటరెడ్డి విగ్రహాన్ని రుస్తుంబాద రామాలయ సమీపంలో ఏర్పాటు చేశారు. ఆ విగ్రహాన్ని మంత్రి ఉభయ రాష్ట్రాల శెట్టిబలిజ సంఘ అధ్యక్షుడు కుడుపూడి సూర్యనారాయణ చేతులమీదుగా ఆవిష్కరించనున్నారని ఆ సంఘ జిల్లా అధ్యక్షుడు జోగి పండు తెలిపారు.