VZM: ఈ నెల 4న జరగనున్న జిల్లా సమీక్షా సమావేశానికి పూర్తి డేటాతో అధికారులు హాజరుకావాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్లో JC సేధు మాధవన్‌తో కలిసి వివిధ శాఖల అధికారులతో మంగళవారం ప్రిలిమినరీ భేటీ నిర్వహించారు. గత సమీక్షలో ఇచ్చిన సూచనలు, యాక్షన్ టేకాన్ రిపోర్ట్, సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనుల పురోగతి డేటాతో రావాలన్నారు.