VSP: ఎండాడలోని జడ్పీ, ఎంపీపీ పాఠశాలలను కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి బోధన, మధ్యాహ్న భోజనం, హాజరు, పాఠశాల పరిశుభ్రత, తదితర వివరాలు తెలుసుకున్నారు. బోధన నాణ్యతను మరింత మెరుగుపరచాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ తనిఖీలో ఆయన వెంట డీఈవో ప్రేమ్ కుమార్ ఉన్నారు.