VZM: జిల్లా పోలీసులకు స్దానిక తిరుమల మెడికవర్ హాస్పిటల్ MD డా.తిరుమల ప్రసాద్ శనివారం అత్యాధునిక డ్రోన్‌ను జిల్లా ఎస్పీ ఏఆర్. దామోదర్ కు బహుమతిగా అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలు, ట్రాఫిక్, నేరాల నివారణకు ఈ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగపడుతుందని తెలిపారు. పెద్ద ఎత్తున జరిగే కార్యకమాలలో నిఘాకు ఇది కీలకం కానుందన్నారు.