KDP: ఖాజీపేట మండలం పత్తూరులో తాగునీటి అవసరాలకోసం నిర్మించిన ట్యాంకు పూర్తిగా దెబ్బతింది. ట్యాంక్ నుంచి సిమెంట్ పెచ్చులు ఊడి కింద పడుతున్నాయి. ట్యాంకు నిర్మించి దాదాపు 35ఏళ్లు అవుతుంది. శిథిలావస్థ స్థితికి చేరుకున్న ట్యాంకు వల్ల ప్రమాదాలు పొంచి ఉన్నాయని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. పాడుబడిన ట్యాంక్ స్థానంలో కొత్త వాటర్ ట్యాంకు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.