SKLM: సారవకోట M ఉప్పరపేటకి చెందిన యూ. రామారావుకు ఆరు నెలల జైలు శిక్షతో, రూ .1000 జరిమానా విధిస్తూ పాతపట్నం జూనియర్ సివిల్ జడ్జి ఎం. రోషిణి సోమవారం తీర్పు వెలువరించారు. 2019 అక్టోబర్ 25న సవరడ్డపనసకి చెందిన కొల్లి నారాయణమ్మను ద్విచక్రవాహనంతో ఢీకొనడంతో ఆమె మృతి చెందిన కేసులో ఈ శిక్ష విధించినట్లు ఎస్సై అనిల్ కుమార్ తెలిపారు.