కర్నూలు: నగర పరిధిలో ఉన్న ఉద్యానవనాల అభివృద్ధికి ప్రతిపాదనలను రూపొందించాలని అధికారులను నగరపాలక సంస్థ కమిషనర్ పి. విశ్వనాథ్ ఆదేశించారు. ఇవాళ ఎస్ఐసీ ఎంప్లాయిస్ కాలనీ, మున్సిపల్ ఎంప్లాయిస్ కాలనీ, వీనస్ కాలనీ, ప్రేమ్ నగర్ ప్రాంతాల పార్కులను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు.