KDP: బ్రహ్మంగారిమఠం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయంలో గురువారం నుంచి ఈశ్వరీదేవి ఆరాధన గురుపూజా మహోత్సవాలు 16వ తేదీ వరకు జరగనున్నట్లు మఠాధిపతి వీర శివకుమార్ స్వామి తెలిపారు. పలు సాంస్కృతిక, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. భక్తులు వచ్చి దేవుని దర్శించుకోవాల్సిందిగా కోరారు. వీరబ్రహ్మేంద్రస్వామిని దర్శిస్తే సిరిసంపదలు వస్తాయన్నారు.